HURL Recruitment: హిందుస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ (HURL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, ఎఫ్‌సీఐఎల్, హెచ్‌ఎఫ్‌సీఎల్ సబ్సిడరీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 390 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్లు, ఇంజినీర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టోర్ అసిస్టెంట్లు, జూనియర్ క్వాలిటీ అసిస్టెంట్లు, క్వాలిటీ అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఎలక్ట్రికల్, మెకానికల్, ఇనుస్ట్రుమెంటేషన్, స్టోర్, ఎన్విరాన్‌మెంట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బీఏ/ బీఎస్సీ/ బీకాం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఏడాదికి రూ. 4.1 లక్షల నుంచి రూ. 5.8 లక్షల వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 24-06-2022 తేదీన మొదలై 03-07-2022తో ముగియనుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..