HAL Recruitment: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం..

HAL Recruitment: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. బెంగళూరు క్యాంపస్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చసుకోవాలి.?

HAL Recruitment: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం..

Updated on: Feb 07, 2022 | 9:44 AM

HAL Recruitment: హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. బెంగళూరు క్యాంపస్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అడిషనల్‌ జనరల్‌ మేనేజర్ (సివిల్‌) – 01, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (సివిల్‌) – 01, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌) – 01, చీఫ్‌ మేనేజర్ (లీగల్‌) – 01, హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ (02), లీగల్‌ ఆఫీస్‌ (01) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ఛీఫ్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), రిక్రూట్‌మెంట్ సెక్షన్‌, హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ కార్పొరేట్‌ ఆఫీస్‌, బెంగళూరు 560001 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను తొలుత స్క్రీనింగ్ టెస్ట్‌, షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. అనంతరం పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40,000 నుంచి రూ. 2,60,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 160-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Yoga Tips: రాత్రిపూట నిద్రపట్టడం లేదా..? అయితే ఈ యోగాసనాలతో చెక్ పెట్టండి..

Viral Photos: ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించి రికార్డ్‌ సృష్టించిన జంతువులు ఇవే..?

Telegram: మెసేజ్‌లు ఏ భాషలో వచ్చినా సరే.. మీకు నచ్చిన భాషలో చదువుకోవచ్చు. టెలిగ్రామ్‌లో ఆసక్తికర ఫీచర్‌..