GRSE Ltd Supervisor Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (JRSE).. ఒప్పంద ప్రాతిపదికన సూపర్‌వైజర్, ఇంజిన్ టెక్నీషియన్ పోస్టుల (Supervisor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 58
పోస్టుల వివరాలు: సూపర్‌వైజర్, ఇంజిన్ టెక్నీషియన్, డిజైన్ అసిస్టెంట్ పోస్టులు
విభాగాలు: ఐటీ, ఫైనాన్స్, లీగల్, మెకానికల్, ఎలక్ట్రికల్, పెయింట్ టెక్నాలజీ, సివిల్, నేవల్ ఆర్కిటెక్చర్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.23,800లతోపాటు ఇతర అలవెన్సులు కూడా అందిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 28, 2022.
రాత పరీక్ష తేదీ: ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో ఉంటుంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.