Gate Exam 2022: గేట్ పరీక్ష వాయిదా పడే అవకాశం.. IIT ఖరగ్‌పూర్ నోటీసు జారీ..?

|

Jan 22, 2022 | 8:07 PM

Gate Exam 2022: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్‌పూర్ (IIT ఖరగ్‌పూర్) దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో GATE పరీక్షను

Gate Exam 2022: గేట్ పరీక్ష వాయిదా పడే అవకాశం.. IIT ఖరగ్‌పూర్ నోటీసు జారీ..?
Gate 2022 Admit Card
Follow us on

Gate Exam 2022: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్‌పూర్ (IIT ఖరగ్‌పూర్) దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో GATE పరీక్షను నిర్వహించబోతోంది. పరీక్ష అథారిటీ అడ్మిట్ కార్డ్‌ను జనవరి 15న gate.iitkgp.ac.inలో విడుదల చేసింది. అయితే దేశవ్యాప్తంగా పెరుగుతున్న COVID-19 కేసుల మధ్య IIT ఖరగ్‌పూర్ అధికారిక వెబ్‌సైట్‌లో ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది. కరోనా కేసుల పెరుగుదల కారణంగా గేట్ పరీక్ష వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. GATE 2022 పరీక్షకు హాజరయ్యే దరఖాస్తుదారులు కరోనా వ్యాక్సిన్‌ను కచ్చితంగా వేసుకోవాలని సూచించింది.

నోటీసులో ఇలా ఉంది.. ‘గేట్ పరీక్షలో పాల్గొనే అభ్యర్థుల ఆరోగ్యం, భద్రతకు చాలా ముఖ్యం. ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితి కారణంగా పరీక్షల తేదీలు మారవచ్చు. లేదంటే GATE 2022 పరీక్ష వాయిదా పడవచ్చు. అవసరమనుకుంటే రద్దు కూడా కావొచ్చు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ కచ్చితంగా టీకాలు వేయించుకోవాలని’ ఉంది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత గేట్ పరీక్ష పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ వీరేంద్ర కుమార్ తివారీ తెలిపారు. జనవరి 15న గేట్ అడ్మిట్ కార్డ్‌లు జారీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 23,000 మంది విద్యార్థులు గేట్ 2022ని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

పరీక్షా కేంద్రంలో రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభ్యర్థులు వాదిస్తున్నారు. గేట్ పరీక్షను వాయిదా వేయాలని పలువురు విద్యార్థులు ట్విట్టర్‌ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. IIT ఖరగ్‌పూర్ విడుదల చేసిన GATE 2022 షెడ్యూల్ ప్రకారం.. GATE 2022 ఫలితాల తేదీ 17 మార్చి 2022. GATE పరీక్ష 2022 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 02 సెప్టెంబర్ 2021 నుంచి ప్రారంభించబడింది.

కేంద్రం గుడ్‌న్యూస్‌.. బడ్జెట్‌లో మరో కొత్త సామాజిక భద్రతా పథకం ప్రకటించే అవకాశం..!

15 ఏళ్లుగా భర్త జైలులో ఉంటే.. భార్య మాత్రం నలుగురు పిల్లల తల్లిగా మారింది.. స్టోరీ తెలిస్తే షాక్‌ అవుతారు..?

ఈ లడ్డూలు తింటే జలుబు, దగ్గు మటుమాయం.. రోగనిరోధక శక్తి సూపర్..