FCI Recruitment: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వివిధ జోన్స్‌లో ఉన్న 5043 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్‌లో భాగంగా మొత్తం 5043 పోస్టులను భర్తీ చేయన్నారు.
* వీటిలో జూనియర్ ఇంజినీర్ (సివిల్ ఇంజినీరింగ్), జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, అసిస్టెంట్ గ్రేడ్-3(జనరల్), అసిస్టెంట్ గ్రేడ్-3(అకౌంట్స్), అసిస్టెంట్ గ్రేడ్-3(టెక్నికల్), అసిస్టెంట్ గ్రేడ్-3(డిపో), అసిస్టెంట్ గ్రేడ్-3(హిందీ) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* ఇక జోన్ల వారీ ఖాళీల విషయానికొస్తే.. నార్త్ జోన్ (2388), సౌత్ జోన్ (989), ఈస్ట్ జోన్ (768), వెస్ట్ జోన్ (713), నార్త్‌ఈస్ట్ జోన్ (185) ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్/ బోటనీ/ జువాలజీ/ బయో-టెక్నాలజీ/ బయో-కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ ఫుడ్ సైన్స్), బీఈ, బీటెక్ (ఫుడ్ సైన్స్/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ బయో-టెక్నాలజీ/ సివిల్), డిప్లొమా (సివిల్/ మెకానికల్)/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఫేజ్-1, ఫేజ్-1 ఆన్‌లైన్ పరీక్ష, స్టెనో పోస్టులకు స్కిల్/టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో ఫేజ్-1 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 06-09-2022న మొదలవుతుండగా 05-10-2022తో ముగియనుంది. ఆన్‌లైన్ పరీక్షను 2023 జనవరిలో నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..