ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో 491 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..

ESIC Recruitment: ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 491 ఖాళీలను భర్తీ చేయనున్నారు...

ESIC Recruitment: ఈఎస్‌ఐసీలో 491 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
ESIC Bangalore

Updated on: Jul 08, 2022 | 7:57 PM

ESIC Recruitment: ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 491 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఈఎస్‌ఐసీ పీజీఐఎంఎస్‌ఆర్‌, మెడికల్‌ కాలేజీల్లో ఉన్న 491 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* వీటిలో అనస్థీసియాలజీ 40, అనాటమీ 19, బయోకెమిస్ట్రీ 14, కమ్యూనిటీ మెడిసిన్‌ 33, డెంటిస్ట్రీ 3, డెర్మటాలజీ 5, ఎమర్జెన్సీ మెడిసిన్‌ 9, ఎఫ్‌టీఎం 5, జనరల్‌ మెడిసిన్‌ 51, జనరల్‌ సర్జరీ 58, మైక్రోబయాలజీ 28, ఓబీజీవై 35, ఆప్తల్మాలజీ 18, ఆర్థోపెడిక్స్‌ 30, ఈఎన్‌టీ 17, పీడియాట్రిక్స్‌ 33, పాథాలజీ 22, ఫార్మకాలజీ 15, ఫిజికల్‌ మెడిసిన్‌-రిహాబిలిటేషన్‌ 8, సైకాలజీ 14, సైకియాట్రీ 7, రేడియాలజీ 14, రెస్పిరేటరీ మెడిసిన్‌ 6, స్టాటిస్టీసియన్‌ 4, బ్లడ్‌ బ్యాంక్‌ 3 చొప్పున ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌ పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 40 ఏళ్లు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 18-07-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..