Jobs: హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ఈఐఎస్‌ఐ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా ఎంపిక..

|

Mar 19, 2023 | 10:38 AM

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్న ఈఎస్‌ఐ హాస్పిటళ్లు/ ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు/ ఈఎస్‌ఐ డయాగ్నస్టిక్ సెంటర్‌లలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. కాంట్రాక్ట్ విధానంలో జాయింట్ డైరెక్టర్...

Jobs: హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ఈఐఎస్‌ఐ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. మార్కుల ఆధారంగా ఎంపిక..
Esi Jobs
Follow us on

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఉన్న ఈఎస్‌ఐ హాస్పిటళ్లు/ ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు/ ఈఎస్‌ఐ డయాగ్నస్టిక్ సెంటర్‌లలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. కాంట్రాక్ట్ విధానంలో జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 114 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (59), డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (01), ల్యాబ్ టెక్నీషియన్ (11), ఫార్మసిస్ట్ (43) ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* సీఏఎస్‌, డీఏఎస్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.58,850; ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.31,040 అందిస్తారు.

* దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, అయిదో అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పిటల్ సనత్‌నగర్, నాచారం, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 28-03-2023ని నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..