ECL Recruitment: ఈస్ట్రర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
ECL Recruitment: ఈస్ట్రర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ECL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థకు అనుబంధ సంస్థ అయిన ఈ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు....
ECL Recruitment: ఈస్ట్రర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ECL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థకు అనుబంధ సంస్థ అయిన ఈ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 313 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జనరల్ క్యాటగిరీ (27), ఈడబ్ల్యూఎస్ (30), ఓబీసీ (83), ఎస్‌సీ (46), ఎస్టీ (23) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 10+2 విద్యార్హత పూర్తి చేసిఉండాలి.
* అంతేకాకుండా మైనింగ్ సర్టిఫికేట్‌తో పాటు గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్లు ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 10-03-2022తో మముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
దరఖాస్తు విధానం..
* ముందుగా అధికారిక వెబ్‌సైట్ easterncoal.gov.inలోకి వెళ్లాలి.
* అనంతరం Recruitment ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత అవసరమైన వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్ నొక్కాలి.
* క్యాటగిరీ ఆధారంగా పేర్కొన్న పరీక్ష ఫీజును చెల్లించాలి.
* చివరగా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అప్లికేషన్ ఫామ్‌ను ప్రింట్ తీసుకోవాలి.
Also Read: Anupama parameswaran: జీవితంలో నేను కోరుకునేది అదే.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన అనుపమ పరమేశ్వరన్.
Andhra Pradesh: సిమ్ కార్డు కొంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీ వెన్నులో వణుకుపుట్టే విషయం
Andhra Pradesh: సిమ్ కార్డు కొంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీ వెన్నులో వణుకుపుట్టే విషయం