Railway Jobs: టెన్త్ పాస్ అయితే చాలు.. రైల్వేలో జాబ్.. ఎలాంటి రిజర్వేషన్లు లేవ్.. సోమవారమే లాస్ట్ డేట్
రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోని యువత కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైల్ కౌశల్ వికాస్ యోజన' పేరుతో వారిని స్వయం సాధికారత దిశగా అడుగులు వేయిస్తుంది.
Rail Kaushal Vikas Yojana: రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోని యువత కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైల్ కౌశల్ వికాస్ యోజన’ పేరుతో వారిని స్వయం సాధికారత దిశగా అడుగులు వేయిస్తుంది. యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఇది పూర్తిగా ఉచితం. మెషినిస్టు, వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అంశాల్లో మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సెంటర్లలో ట్రైనింగ్ ఇస్తారు. రైల్వేలకు పనికివచ్చే ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రైనింగ్ ఇస్తారు. అది కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్‌మెంట్ కల్పిస్తారు. ఇలా కాకుండా కోర్సు నేర్చుకున్న తర్వాత ఎవరైనా సొంతంగా ఉపాధి పొందాలనుకుంటే వారికి సాయ సహకారాలు అందిస్తారు. అంటే మిషనరీ కొనుగోలులో డిస్కౌంట్ ఇప్పించడం.. లోన్లు వచ్చేలా చేయడం వంటివి. మూడేళ్లలో 50 వేల మందికి ట్రైనింగ్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఫిబ్రవరి 7న విడుదలైంది. అప్లై చేయడానికి చివరి తేదీ 21.2.22. ఈ పోస్టులకు సంబంధించి గొప్ప విషయం ఏంటంటే.. ఎలాంటి రిజర్వేషన్లు లేవు.
ఇందుకు అర్హతలు ఒకసారి చూద్దాం…
- 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసు వారై ఉండాలి.
- భారతీయ పౌరులై ఉండాలి.
- టెన్త్ పాసై ఉండాలి
- టెన్త్ క్లాసులో వచ్చిన మార్కుల ద్వారా దరఖాస్తుదారులను ఎంపిక చేస్తారు.
- ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు
- మంచి ఫిట్‌నెస్ ఉండాలి
- డాక్టర్ నుంచి నుంచి చూపు, వినికిడి, మానసిక ఆరోగ్యం బాగున్నాయనే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ దరఖాస్తు పత్రంతో పాటు సిబ్మిట్ చేయాలి.
- అభ్యర్థికి ఎలాంటి అంటువ్యాధులు లేవనే ధ్రువీకరణ కూడా అవసరం.
- ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ‘నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇనిస్టిట్యూట్’ సర్టిఫికేట్లను ఇస్తారు
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం.. శిక్షణలో భాగంగా స్టైపెండ్, ఇతర అలవెన్సుల లాంటివేమీ ఇవ్వరు. ఒక ట్రేడ్‌లో ఒకసారి మాత్రమే అభ్యర్థిని అనుమతిస్తారు. సర్టిఫికేట్ పొందడానికి 75 శాతం హాజరు మస్ట్‌గా ఉండాలి. రైల్ కౌశల్ వికాస్ యోజన వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసిన దరఖాస్తును ట్రైనింగ్ సెంటర్లకు పోస్టు ద్వారా పంపచ్చు. అప్లికేషన్లు ఆన్‌లైన్లో కూడా తీసుకుంటారు. మరిన్ని వివరాల కోసం https://railkvy.indianrailways.gov.in/rkvy_userHome/ చూడొచ్చు.
Also Read: తిప్పతీగతో దిమ్మతిరిగే బెనిఫిట్స్.. రోజు 2 ఆకులు నమిలితే ఎన్నో ఉపయోగాలు