SSC Exams: కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో విద్యా రంగం ఒకటి. రోజురోజుకీ వైరస్ ఉధృతితో పాటు, కేసుల సంఖ్య పెరుగుతుండడంతో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ఏకంగా రెండు విద్యా సంవత్సరాలు ఈ మహమ్మారి కారణంగా ప్రభావితమయ్యాయి. ఇక కేవలం విద్యా సంస్థలకే పరిమితం కాకుండా పోటీ పరీక్షలపై కూడా కరోనా ప్రతికూలం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన చాలా పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మరో పోటీ పరీక్ష వచ్చి చేరింది. దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) పరిధిలోని పలు పరీక్షలను వాయిదా వేసింది. ఇందులో భాగంగా.. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ(10+2) లెవెల్(టైర్-1) ఎగ్జామినేషన్-2020, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్(టైర్-1) ఎగ్జామినేషన్-2020 పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ పరీక్షను మే 21, 22న, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను మే 29 నుంచి జూన్ 7 వరకు నిర్వహించాల్సి ఉంది. వీటితో పాటు.. సీఏపీఎఫ్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్‌లో కానిస్టేబుల్(జీడీ) పోస్టులకు, అస్సాంలో రైఫిల్‌మెన్ పోస్టులకు విడుదల చేయాల్సిన నోటిఫికేషన్‌ను కూడా వాయిదా వేసినట్లు ఎస్ఎస్‌సీ ప్రకటించింది. ఇక వాయిదా పడిన పరీక్షలు, నోటిఫికేషన్‌కు సంబంధించిన కొత్త తేదీలను తర్వలోనే ప్రకటిస్తామని ఎస్ఎస్‌సీ పేర్కొంది.
Also Read: SDM జాబ్ గురించి మీకు తెలుసా..? జీతం ఎంత వస్తుంది..! సౌకర్యాలు ఎవరు కల్పిస్తారు..