AP DSC: ‘టీడీపీ అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ’: నారా లోకేశ్‌

|

Feb 12, 2024 | 5:24 PM

రానున్న ఎన్నికల్లో విజయం లక్ష్యంగా తెలుగు దేశం పార్టీ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘శంఖారావం’ పేరిట ఎన్నికల ప్రచారానికి ఆయన ఆదివారం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ..

AP DSC: టీడీపీ అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ: నారా లోకేశ్‌
చంద్రబాబు తనయుడు లోకేష్
Follow us on

ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 12: రానున్న ఎన్నికల్లో విజయం లక్ష్యంగా తెలుగు దేశం పార్టీ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘శంఖారావం’ పేరిట ఎన్నికల ప్రచారానికి ఆయన ఆదివారం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ..

‘2019 ఎన్నికల ముందు 23 వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. ఆ తర్వాత 18 వేల పోస్టులే ఉన్నాయన్నారు. స్కూల్‌ రేషనలైజేషన్‌ పేరుతో ఆ పోస్టులను మరింత తగ్గించారు. ఇప్పుడు ఎన్నికల ముందు హడావిడి చేస్తూ నామమాత్రంగా 6 వేల పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చారు. నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ముందు 6,100 డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి కొత్త డ్రామాకు తెర లేపింది. ఇది మెగా డీఎస్సీ కాదు. దగా డీఎస్సీ. ఎన్టీఆర్, చంద్రబాబు డీఎస్సీ ద్వారా లక్షా  70 వేల పోస్టులు భర్తీ చేశారు. వచ్చేది మన ప్రభుత్వమే.. ప్రతి యేటా డీఎస్సీ నిర్వహిస్తాం’ అని లోకేశ్ చెప్పారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ ముందుకెళ్తోంది. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా.. కదలిరా’ సభలతో విస్తృతంగా ప్రచారం చేస్తుంటే.. మరోవైపు నారా లోకేష్ కూడా తనదైన రీతిలో రంగంలోకి దిగారు. ఇటీవలే యువగళం పాదయాత్ర పూర్తి చేసిన నారా లోకేష్, యువగళం పాదయాత్రలో కవర్ చేయని ప్రాంతాల్లో ‘శంఖారావం’ పేరుతో యాత్ర చేపట్టారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో శంఖారావం యాత్రను ఫిబ్రవరి 11న నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే యేటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.