AP Paramedical posts: గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (ఆగస్టు 20) ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 132 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో రేడియో గ్రాఫర్ (15), జనరల్ డ్యూటీ అటెండెంట్ (36), డైటీషియన్ (01), ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులు (02), డెంటల్ టెక్నీషియన్ (01), మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ (02), ల్యాబ్ అటెండెంట్ (04), ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు (11), ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు (13), ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (06), ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు (14), ఫిజియో థెరపిస్ట్ పోస్టులు (01), ప్లంబర్ (03), శానిటరీ వర్కర్ కమ్ వాచ్ మెన్ (13), ఓటీ టెక్నీషియన్ (09) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి నుంచి ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అలాగే ఏవైనా సర్టిఫికెట్ కోర్సులలో అర్హత కలిగి ఉండాలి.
* అభ్యర్థుల వయసు జులై 01, 2022 నాటికి 42 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఇందు కోసం ముందుగా అధికారిక వెబ్ సైట్‌లో దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ఫామ్‌ను నింపి దానితో పాటు సంబంధిత సర్టిఫికేట్‌లను జత చేసి జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. గుంటూరు అడ్రస్‌కు పంపించాలి.
* దరఖాస్తు స్వీకరణకు నేటితో (20-08-2022)తో గడువు ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..