DMHO East Godavari Jobs 2022: తూర్పు గోదావరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (DMHO East Godavari) పరిధిలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లో.. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్ పోస్టుల (Arogya Mitra Posts) భర్తీకి..

DMHO East Godavari Jobs 2022: తూర్పు గోదావరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
Andhra Pradesh
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 23, 2022 | 11:09 AM

DMHO East Godavari Arogya Mitra Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం (DMHO East Godavari) పరిధిలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లో.. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్ పోస్టుల (Arogya Mitra Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 22

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/ఎంఎస్సీ/బీఫార్మసీ/ఫార్మాడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: District Medical and Health Office, Kakinada District, AP.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.