కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని గార్గీ కాలేజ్.. 100 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. బోటనీ, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సంస్కృతం, జువాలజీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియ చేపట్టింది. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎంఫిల్/పీహెచ్‌డీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. యూజీసీ నెట్/సీఎస్‌ఐఆర్ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 25 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 7, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు ఖచ్చితంగా రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు చెల్లించనవసరం లేదు. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.