
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) పీజీ 2025 ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 13 నుంచి ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మార్చి 13 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రోజుకు మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 157 సబ్జెక్టుల్లో పరీక్షలు జరుగుతాయి.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశ వ్యాప్తంగా ఉన్నా అన్ని సెంట్రల్ యూనివర్సిటీలు, ప్రముఖ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీ పీజీ (CUET PG) – 2025 ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. వీటిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో మాత్రమే జరిగే పరీక్ష. పరీక్షల సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు పరీక్షలకు పది రోజుల ముందు జారీ చేస్తారు. అనంతరం అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు.
సీయూఈటీ పీజీ 2025 పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రైల్వే శాఖ అసిస్టెంట్ లోకో పైలట్ సీబీటీ- 1 ఫలితాలను ఆర్‌ఆర్‌బీ తాజాగా విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయగా మొత్తం 1251 మంది సీబీటీ- 2 పరీక్షకు అర్హత సాధించారు. మొదటి స్టేజ్ పరీక్ష రాసిన అభ్యర్థులందరు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి స్కోర్‌కార్డ్, ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ అవకాశం ఫిబ్రవరి 27 వరకు అందుబాటులో ఉంటుంది. అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షకు సంబంధించి కట్‌ఆఫ్ మార్కులను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇక సీబీటీ-2 పరీక్షలు మార్చి 19, 20వ తేదీల్లో జరగనున్నట్లు తాజాగా రైల్వేబోర్డు వెల్లడించింది.
రైల్వే లోకో పైలట్ సీబీటీ-1 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.