
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) 2026 ఫిబ్రవరి నోటిఫికేషన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తాజాగా విడుదల చేసింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేవీఎస్, ఎన్‌వీఎస్, సెంట్రల్ స్కూళ్లు, సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో, కేంద్ర ప్రభుత్వం పరిధిలోని స్కూళ్లలో టీచర్లుగా కొనసాగాలనుకునే వారికి నిర్వహించే కీలకమైన అర్హత పరీక్ష. ఈ పాఠశాలల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతులకు బోధించాలంటే తప్పనిసరిగా సీటెట్‌లో అర్హత సాధించవల్సి ఉంటుంది. యేటా ఈ పరీక్షను సీబీఎస్సీ రెండు సార్లు నిర్వహిస్తూ ఉంటుంది. వచ్చే ఏడాదికి తొలి విడత నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఫిబ్రవరి 2026 ఏడాదికి సంబంధించిన సీటెట్‌కు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) ఫిబ్రవరి-2026 పరీక్ష మొత్తం రెండు పేపర్‌లకు ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి, రెండో పేపర్ 6వ నుంచి 8వ తరగతులకు బోధించాలనుకునే వారికి నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్‌కు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పరీక్షను దేశ వ్యాప్తంగా ఉన్న 20 భాషలలో నిర్వహిస్తారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలంటే.. పేపర్ 1కు ఇంటర్మీడియట్‌తో పాటు డీఈఎల్‌ఈడీ లేదా బీఈఎల్‌ఈడీలో ఉత్తీర్ణత పొందాలి. పేపర్ 2కు డిగ్రీ డీఈడీ (ప్రత్యేక విద్య), బీఈడీ, బీఈడీ(ప్రత్యేక విద్య), / బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 18, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్/ ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు ఏదైనా ఒక పేపర్కు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200 చొప్పున చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్ధులకు ఏదైనా ఒక పేపర్కు రూ.500, రెండు పేపర్లకు రూ.600 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇక సీటెట్ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఫిబ్రవరి 8, 2026వ తేదీన నిర్వహిస్తారు. పేపర్ 1 ఉదయం 9:30 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మద్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. ఇతర వివరాలకు ఈ కింది అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేయండి.
సీటెట్ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.