CSIR-4PI: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

|

Dec 12, 2022 | 7:42 AM

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌ - ఫోర్త్‌ పారాడిజమ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. 16 సైంటిస్ట్‌, సీనియర్‌ సైంటిస్ట్‌, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డేటా సైన్స్‌ అండ్‌ సూపర్‌కంప్యూటింగ్‌..

CSIR-4PI: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
CSIR-4PI Bangalore
Follow us on

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌ – ఫోర్త్‌ పారాడిజమ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. 16 సైంటిస్ట్‌, సీనియర్‌ సైంటిస్ట్‌, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డేటా సైన్స్‌ అండ్‌ సూపర్‌కంప్యూటింగ్‌, ఎర్త్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ సైన్స్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ సైన్స్/డేటా సైన్స్/ఏఐ అండ్‌ ఎమ్‌ఎల్‌/మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌/కంప్యూటర్‌ నెట్‌ వర్కింగ్‌/సైబర్‌ సెక్యూరిటీ/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ డిజిటల్‌ కమ్యునికేషన్‌ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్‌ 18, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే సమయంలో రూ.800లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.67,700ల నుంచి రూ.1,23,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.