భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన పశ్చిమ బెంగాల్‌లోని కోల్ ఇండియా లిమిటెడ్.. 31 మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, డెర్మటాలజిస్ట్, రేడియోలజిస్ట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/డీఎన్‌బీ, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం కూడా ఉండాలి. దారఖాస్తుదారుల వయసు ఆగస్టు 31, 2022వ తేదీ నాటికి 35 నుంచి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు వయోపరిమితి విషయంలో రిజర్వేషన్ వర్తిస్తుంది.
ఈ అర్హతలున్న అభ్య్ధులు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 27, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అనందరం నింపిన దరఖాస్తులను ప్రింట్ ఔట్ తీసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ/అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
అడ్రస్: Dy. GM/HoD(Executive Establishment Dept), Sanctoria, Dishergarh, Paschim Bardhman, West Bengal- 713333.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.