MSME Hyderabad Jobs: బీఈ/బీటెక్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌.. ఎంఎస్‌ఎంఈ హైదరాబాద్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని సీఐటీడీ - ఎంఎస్‌ఎంఈ టూల రూం (CITD - MSME Tool Room) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

MSME Hyderabad Jobs: బీఈ/బీటెక్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌.. ఎంఎస్‌ఎంఈ హైదరాబాద్‌లో ఉద్యోగాలు..
Msme
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 28, 2022 | 7:48 AM

CITD – MSME Tool Room Hyderabad Recruitment 2022: భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని సీఐటీడీ – ఎంఎస్‌ఎంఈ టూల రూం (CITD – MSME Tool Room) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 7

పోస్టుల వివరాలు:

  • సీఎన్‌సీ మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌: 1
  • ఎలక్ట్రికల్ ఇంజినీర్‌: 1
  • నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌: 1
  • టూల్‌ డిజైన్‌/పీపీసీ ఎన్సల్టెంట్‌: 1
  • 3డీ ప్రింటింగ్‌ ఇంజనీర్‌/ట్రైనర్‌: 1
  • సీఎన్‌సీ రూటర్‌ ప్రోగ్రామర్‌: 1
  • 3డీ స్కానింగ్‌ ఇంజనీర్‌: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్: recruitment@citdindia.org

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Protein Shake Side Effects: ప్రొటీన్‌ షేక్‌ అధికంగా తాగుతున్నారా? కిడ్నీ, లివర్‌, బీపీ సమస్యలతోపాటు ఇంకా..