CUREC 2023 Notification: సెంట్రల్ యూనివర్సిటీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ 2023 నోటిఫికేషన్‌ విడుదల..

|

Dec 03, 2023 | 1:52 PM

దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీల్లో రెగ్యులర్, పర్మనెంట్ ప్రాతిపదికన.. పలు ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన సెంట్రల్ యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్‌ 2023 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద సెంట్రల్‌ యూనివర్సిటీల్లోని నాన్‌ టీచింగ్‌ నియామకాలు చేపట్టనున్నారు. సెంట్రల్ యూనివర్సిటీస్‌ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-2023 ఆధారంగా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) లో..

CUREC 2023 Notification: సెంట్రల్ యూనివర్సిటీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ 2023 నోటిఫికేషన్‌ విడుదల..
CUREC 2023 Notification
Follow us on

దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీల్లో రెగ్యులర్, పర్మనెంట్ ప్రాతిపదికన.. పలు ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన సెంట్రల్ యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్‌ 2023 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద సెంట్రల్‌ యూనివర్సిటీల్లోని నాన్‌ టీచింగ్‌ నియామకాలు చేపట్టనున్నారు. సెంట్రల్ యూనివర్సిటీస్‌ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-2023 ఆధారంగా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) లో జూనియర్ అసిస్టెంట్-కమ్ టైపిస్ట్- 50 పోస్టులు, స్టెనోగ్రాఫర్- 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మోతిహారి (బీహార్)లోని మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీలో 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంజీసీయూ/ ఇగ్నోలలో ఆన్‌లైన్‌ దరఖాస్తులకు డిసెంబర్ 21, 2023 చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/మహిళా అభ్యర్ధులు రూ.600 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారు డిసెంబర్ 22 నుంచి 25, 2023 వరకు ఏవైనా తప్పులు దొర్లితే దరఖాస్తు సవరణ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) లో 102 ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి
  • జూనియర్ అసిస్టెంట్-కమ్ టైపిస్ట్ పోస్టులు: 50
  • స్టెనోగ్రాఫర్ పోస్టులు: 52

మోతిహారి (బీహార్)లోని మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీలో 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: డిసెంబర్ 1, 2023.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ (ఎంజీసీయూ/ ఇగ్నో): డిసెంబర్‌ 21, 2023.
  • దరఖాస్తు సవరణ తేదీలు: డిసెంబర్‌ 22 నుంచి 25-12-2023 వరకు.

నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.
మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.