CDOT Recruitment 2023: రాత పరీక్షలేకుండా నెలకు రూ.లక్ష జీతంతో సీ-డాక్‌లో 395 కొలువులు.. ఈ అర్హతలుంటే చాలు..

|

Jan 24, 2023 | 8:52 PM

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలస్‌మెంట్‌ ఆఫ్‌ టెలీమాటిక్స్‌ బెంగళూరు, ఢిల్లీలలో పనిచేయుటకు.. ఏడాది కాలం పాటు ఒప్పంద ప్రాతిపదికన 395 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ (4G/5G Project) పోస్టుల..

CDOT Recruitment 2023: రాత పరీక్షలేకుండా నెలకు రూ.లక్ష జీతంతో సీ-డాక్‌లో 395 కొలువులు.. ఈ అర్హతలుంటే చాలు..
CDOT Recruitment 2023
Follow us on

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలస్‌మెంట్‌ ఆఫ్‌ టెలీమాటిక్స్‌ బెంగళూరు, ఢిల్లీలలో పనిచేయుటకు.. ఏడాది కాలం పాటు ఒప్పంద ప్రాతిపదికన 395 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ (4G/5G Project) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి, ఇంటర్మీడియట్‌తోపాటు బీఈ/బీటెక్‌ లేదా తత్సమాన కోర్సులో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 6, 2023లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. విద్యార్హతలు, వయసు, అకడమిక్‌ మెరిట్, అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌-1 కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌-2 కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.