CDAC Recruitment: సీ-డ్యాక్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఐటీ రంగంలో అనుభవం ఉన్న వారికి సదవకాశం.

| Edited By: Ravi Kiran

Sep 21, 2021 | 7:00 AM

CDAC Recruitment 2021: హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌...

CDAC Recruitment: సీ-డ్యాక్‌ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఐటీ రంగంలో అనుభవం ఉన్న వారికి సదవకాశం.
Follow us on

CDAC Recruitment 2021: హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 38 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రాజెక్ట్ మేనేజర్ (01), ప్రాజెక్ట్ ఇంజనీర్లు (36), ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ (01) ఖాళీలు ఉన్నాయి.

* సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ అనాలసిస్‌, మొబైల్‌ సెక్యూరిటీ, ఎంబడెడ్‌ సిస్టమ్‌ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 35,37 ఏళ్లు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 05-10-2021 తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. 

Also Read: Indian Railways Jobs: ఇండియన్‌ రైల్వేలో ఉద్యోగాలు.. 3093 అప్రెంటిస్‌ జాబ్స్‌.. అర్హతలు.. ఇతర వివరాలు..!

JNVST Class-VI admission: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఎప్పుడంటే..?

NIT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో నాన్‌ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే.?