BSF Constable Jobs 2026: పదో తరగతి అర్హతతో బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎంపిక

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)లో.. పదో తరగతి అర్హతతో స్పోర్ట్స్‌ కోటాలో కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం. దరఖాస్తుకు మరో 3 రోజులే ఉంది..

BSF Constable Jobs 2026: పదో తరగతి అర్హతతో బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఎంపిక
BSF Constable GD Sports Recruitment 2026 Notification

Updated on: Dec 29, 2025 | 6:52 AM

కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌).. స్పోర్ట్స్‌ కోటాలో కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 549 కానిస్టేబుల్ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది. ఈ పోస్టుల్లో పురుషులకు 277 పోస్టులు, మహిళలకు 272 పోస్టుల పదో తరగతి అర్హతతో పాటు క్రీడల్లో ప్రావీణ్యం ఉన్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే గత రెండేళ్లలో అథ్లెటిక్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, షూటింగ్, జూడో, కరాటే, రెజ్లింగ్, వెయిట్‌ లిఫ్టింగ్, టేబుల్‌ టెన్నిస్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, సైక్లింగ్, వాటర్‌ స్పోర్ట్స్, ఉషు వంటి తదితర క్రీడల్లో ఏదైనా ఒకదానిలో అంతర్జాతీయ పోటీల్లో బంగారు లేదా వెండి లేదా కాంస్య పతకాలు సాధించి ఉండాలి. లేదంటే పాల్గొన్నవారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అలాగే జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన లేదా పాల్గొన్నవారికి రెండో ప్రాధాన్యం ఉంటుంది. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పురుషుల ఎత్తు 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీమీటర్లు చొప్పున ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ కలిగి ఉండాలి. పురుషుల ఛాతీ 80 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్ల చొప్పున పెరగాలి. ఎస్టీకి 76 సెంటీమీటర్లు ఉండి, గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. ఎత్తు, వయసులకు తగ్గ బరువు కూడా ఉండాలి. వయసు 23 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ,ఎస్టీకి ఐదేళ్ల వయోసడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 1, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.159 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ), మెరిట్‌ ఆధారంగా తుది నియామకాలుంటాయి. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి 69,100 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇతర వివరాలకు బీఎస్‌ఎఫ్‌ వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.