BIS Recruitment 2022: ఇంజ‌నీరింగ్‌తో పాటు ఎంబీఏ చేసిన వారికి కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌న్నర జీతం..

| Edited By: Anil kumar poka

Jan 10, 2022 | 7:55 AM

BIS Recruitment 2022: బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (బీఐఎస్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖకి...

BIS Recruitment 2022: ఇంజ‌నీరింగ్‌తో పాటు ఎంబీఏ చేసిన వారికి కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. నెల‌కు రూ. ల‌క్ష‌న్నర జీతం..
Follow us on

BIS Recruitment 2022: బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (బీఐఎస్‌) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖకి చెందిన ఈ కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లో ప‌లు ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 08 మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఎన్‌ఐటీఎస్‌, ఎస్‌సీఎండీ, టీఎన్‌ఎండీ, పీఆర్‌టీడీ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో ఎంబీఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం త‌ప్ప‌నిస‌రి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్య‌ర్థులు ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను పంపించాలి.

* అభ్య‌ర్థులు త‌మ వివ‌రాలతో కూడిన ద‌ర‌ఖాస్తును me.hrd@bis.gov.in మెయిల్ ఐడీకి పంపించాలి.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 1.50 ల‌క్ష‌లు జీతంగా అందిస్తారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Covirgin: ఇప్పటిదాకా కరోనా సోకనివారిని ఏమని పిలుస్తారో తెలుసా? డిక్షనరీలో పుట్టుకొచ్చిన కొత్త పదం!

Coronavirus: బండ్లగణేశ్‌ను వదలనంటోన్న కరోనా.. మూడోసారి మహమ్మారి బారిన పడినట్లు ట్వీట్..

Corona: వారికి వర్క్​ ఫ్రం హోం.. కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త మార్గదర్శకాలు