Google : గూగుల్‌ ఉద్యోగులకు బిగ్ షాక్‌.. 12 వేల మంది ఔట్‌..

|

Jan 21, 2023 | 7:40 AM

గూగుల్‌ ఉద్యోగులకు షాక్‌..12వేల మంది ఉద్యోగులు ఔట్‌..ఎస్‌. సెర్చింజన్ దిగ్గజం గూగుల్..ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది.

Google : గూగుల్‌ ఉద్యోగులకు బిగ్ షాక్‌.. 12 వేల మంది ఔట్‌..
Google
Follow us on

గూగుల్‌ ఉద్యోగులకు షాక్‌..12వేల మంది ఉద్యోగులు ఔట్‌..ఎస్‌. సెర్చింజన్ దిగ్గజం గూగుల్..ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులకు ఈ మెయిల్స్‌ పంపగా..మరికొందరికి త్వరలోనే ఈ సమాచారం అందించనున్నట్టు తెలిపింది.

ఆర్థికమాంద్యం భయాలతో ఇప్పటికే ట్విట్టర్‌, మెటా, అమెజాన్‌ వంటి టెక్‌ దిగ్గజాలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఆ బాటలోనే నడుస్తోంది గూగుల్‌. గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌లో మాస్‌ లే ఆఫ్స్‌లో భాగంగా..6 శాతం ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఐతే ఉద్యోగాలు కోల్పోయే సిబ్బందికి 60 రోజుల నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపారు సీఈఓ సుందర్‌ పిచాయ్. ఐతే పరిహారం ప్యాకేజీ కింద 16 వారాల వేతనంతో పాటు..గూగుల్‌లో పనిచేసిన ప్రతి ఏడాదికి రెండు వారాల శాలరీతో పాటు పలు ప్రయోజనాలు అందిస్తామని వెల్లడించారు. కఠిన సమీక్ష తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు సుందర్‌ పిచాయ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..