BHEL Recruitment 2021: భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేష్ జారీ చేసింది. తిరుచిరపల్లి బీహెచ్ఈఎల్‌లో పార్ట్ టైం మెడికల్ కన్సలెంట్లు (పీటీఎంసీ) స్పెషలిస్టుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం పలికింది.
* ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 11 పార్ట్ టైం మెడికల్ కన్సల్టెంట్లు (పీటీఎంసీ) స్పెషలిస్టులు పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఇందులో భాగంగా.. డెర్మటాలజీ, డయాబెటియాలజీ, గైనకాలజీ&అబ్‌స్టెట్రిక్స్, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, రేడియాలజీ, ఆంకాలజీ, యూరాలజీ పోస్టులను భర్తీ చేస్తారు.
* ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
* దరఖాస్తు చేసుకునే వారు 01.05.2021 నాటికి 64 ఏళ్లు మించకూడదు.
* దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ, సర్టిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్/ ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారు recruit@bhel.inకి వివరాలు పంపించాల్సి ఉంటుంది.
* ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలకునే అభ్యర్థులు తిరుచిరపల్లి బీహెచ్ఈఎల్ చిరునామాకు పంపించాలి.
* దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా 15.05.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు https://careers.bhel.in/bhel/jsp/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read: ఈ ఆలయంలో హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజిస్తుంటారు… ఇంతకీ ఆ గుడి ఎక్కడుందో తెలుసా..
Viral Video : రెండు చిరుత పులుల మధ్య భీకర యుద్దం..! అదీ చెట్టుపై నుంచి.. మీరు ఓ లుక్కేయండి..