BECIL- AIIMS Recruitment 2022: టెన్త్‌ అర్హతతో కేంద్ర కొలువులు.. బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియాలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు..

కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీ రత్న సంస్థ అయిన ఛత్తీస్‌గఢ్‌లోని ఎయిమ్స్‌లో బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL).. ఒప్పంద ప్రాతిపదికన..

BECIL- AIIMS Recruitment 2022: టెన్త్‌ అర్హతతో కేంద్ర కొలువులు.. బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియాలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు..
Becil
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 11, 2022 | 7:43 AM

BECIL- AIIMS Bilaspur Multy Tasking Staff Recruitment 2022: కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినీ రత్న సంస్థ అయిన ఛత్తీస్‌గఢ్‌లోని ఎయిమ్స్‌లో బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL).. ఒప్పంద ప్రాతిపదికన 50 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల (Multy Tasking Staff Posts) భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూషన్‌ నుంచి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. 100 బెడ్ల సామర్ధ్యం కలిగిన ఏదైనా ఆసుపత్రిలో కనీసం ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి. స్కిల్‌ టెస్ట్‌/ఇంటరాక్షన్‌ మీటింగ్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుముగా జనరల్‌/ఓబీసీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.750లు, ఎస్సీ/ఎస్టీఈడబ్ల్యూఎస్‌/పీహెచ్‌ అభ్యర్ధులు రూ.450లు చెల్లించవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 18, 2022లోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.13,290 జీతంగా చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.