BARC Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. బార్క్‌లో 4,374 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హతలు అవసరం..

|

Apr 23, 2023 | 5:52 PM

భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన ముంబయిలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్.. రెక్ట్ రిక్రూట్‌మెంట్/ ట్రైనింగ్ స్కీం ద్వారా డీఏఈ విభాగాల్లో 4,374 టెక్నికల్ ఆఫీసర్, స్టైపెండరీ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

BARC Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. బార్క్‌లో 4,374 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హతలు అవసరం..
BARC
Follow us on

భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన ముంబయిలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్.. రెక్ట్ రిక్రూట్‌మెంట్/ ట్రైనింగ్ స్కీం ద్వారా డీఏఈ విభాగాల్లో 4,374 టెక్నికల్ ఆఫీసర్, స్టైపెండరీ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బయో-సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, మైనింగ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు మే 22, 2023వ తేదీ నాటికి టెక్నికల్ ఆఫీసర్‌కు 18-35, సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 18-30, టెక్నీషియన్‌కు 18-25, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1కు 19-24, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-2కు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో మే 22, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో టీవోకు రూ.500, ఎస్‌ఏకు రూ.150, టెక్నీషియన్‌కు రూ.100, కేటగిరీ-1కు రూ.150, కేటగిరీ-2కు రూ.100లు.. ఆయా పోస్టులకు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • టెక్నికల్ ఆఫీసర్/ సి పోస్టులు: 181
  • సైంటిఫిక్ అసిస్టెంట్/ బి పోస్టులు: 7
  • టెక్నీషియన్/ బి పోస్టులు: 24

ప్రారంభ వేతనం నెలకు..

  • టీవో ఖాళీలకు రూ.56,100
  • ఎస్‌ఏకు రూ.35,400
  • టెక్నీషియన్ పోస్టులకు రూ.21,700
  • కేటగిరీ-1కు రూ.24,000 నుంచి రూ.26,000
  • కేటగిరీ-2కు రూ.20,000 నుంచి రూ.22,000 వరకు జీతంగా చెల్లిస్తారు

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.