AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APRJC CET 2026: గురుకులాల్లో ఇంటర్‌ ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు.. ఏపీ ఆర్‌జేసీ సెట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల

APRJC CET 2026 Online Application: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల జూనియర్​ కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్​ఇంగ్లిష్‌ మీడియం ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఆర్‌జేసీ సెట్‌ 2026కు విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నోటిఫికేషన్‌..

APRJC CET 2026: గురుకులాల్లో ఇంటర్‌ ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు.. ఏపీ ఆర్‌జేసీ సెట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల
APRJC CET 2026 Notification
Srilakshmi C
|

Updated on: Feb 20, 2026 | 2:56 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల జూనియర్​ కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్​ఇంగ్లిష్‌ మీడియం ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఆర్‌జేసీ సెట్‌ 2026కు విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఏపీ ఆర్‌జేసీ సెట్‌ 2026 నోటిఫికేషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఏపీ ఆర్‌జేసీ సెట్‌ 2026లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో వివిధ గ్రూపుల్లో సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్ధులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో పాటు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరం పదో తరగతి చదువుతున్న బాలికలు, బాలురు ఎవరైనా మార్చి 31, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ ఆర్‌జేసీ సెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2026కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు 2025-26 విద్యా సంవత్సరం పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పరీక్షలు రాయబోతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.300 తప్పక చెల్లించాలి. అర్హులైన విద్యార్థులు మార్చి 31, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులందరికీ ఏప్రిల్‌ 24, 2026వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్ధులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 బాలురు, బాలికలు గురుకుల జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశాలు పొందవచ్చు. వీటిల్లో మొత్తం 1425 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష విధానం

మొత్తం 150 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్​ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది. క్వశ్చన్ పేపర్ తెలుగు – ఇంగ్లిష్‌, ఉర్దూ- ఇంగ్లిష్‌ మీడియంలలో ఉంటుంది. పదో తరగతి నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 18, 2025.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 31, 2026.
  • హాల్‌టికెట్‌ జారీ తేదీ: ఏప్రిల్‌ 15, 2026.
  • ఏపీఆర్‌జేసీ సెట్‌ 2026 ప్రవేశ పరీక్ష తేదీ: ఏప్రిల్ 24, 2026.
  • ఫలితాల ప్రకటన తేదీ: మే 15, 2026.

ఏపీ ఆర్‌జేసీ సెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఈ ప్రభుత్వ పథకంలో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 10 లక్షలు!
ఈ ప్రభుత్వ పథకంలో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 10 లక్షలు!
మీ ఇంట్లో ఈ మార్పులు చేస్తే.. కుబేరుడి అనుగ్రహంతో ధన ప్రవాహమే..!
మీ ఇంట్లో ఈ మార్పులు చేస్తే.. కుబేరుడి అనుగ్రహంతో ధన ప్రవాహమే..!
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు.. APRJC CET 2026 నోటిఫికేషన్ విడుదల
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు.. APRJC CET 2026 నోటిఫికేషన్ విడుదల
జెర్రిపోతు ఎదురైతే టర్కీ కోడి రియాక్షన్ చూశారా..?
జెర్రిపోతు ఎదురైతే టర్కీ కోడి రియాక్షన్ చూశారా..?
వరుసగా రెండోసారి ఫైనల్లో తలపడనున్న భారత్ - పాక్
వరుసగా రెండోసారి ఫైనల్లో తలపడనున్న భారత్ - పాక్
ఇంటర్‌ హాల్‌టికెట్ల 2026లో తప్పులు దొర్లాయా..? ఇలా సరిచేసుకోండి
ఇంటర్‌ హాల్‌టికెట్ల 2026లో తప్పులు దొర్లాయా..? ఇలా సరిచేసుకోండి
45 నిమిషాల ప్రయాణం ఇప్పుడు 10 నిమిషాల్లోనే..కొత్త ఎయిర్‌ ట్యాక్సీ
45 నిమిషాల ప్రయాణం ఇప్పుడు 10 నిమిషాల్లోనే..కొత్త ఎయిర్‌ ట్యాక్సీ
యువతలో బీపీ ఎందుకు పెరుగుతుంది..? మీ గుండెను ఆపేసే రక్తపిశాచి..
యువతలో బీపీ ఎందుకు పెరుగుతుంది..? మీ గుండెను ఆపేసే రక్తపిశాచి..
జెస్ట్‌ ప్రాంప్ట్‌ ఇస్తే చాలు ఒరిజినల్‌ మ్యూజిక్‌ రెడీ!
జెస్ట్‌ ప్రాంప్ట్‌ ఇస్తే చాలు ఒరిజినల్‌ మ్యూజిక్‌ రెడీ!
నాలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు..
నాలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు..