APPSC Group 1 Answer Key: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఆన్సర్ ‘కీ’ విడుదల.. ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి..

|

Jan 10, 2023 | 2:04 PM

ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు-1 ప్రిలిమినరీ రాత పరీక్ష జనవరి 8న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ ఆన్సర్‌ 'కీ'ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది..

APPSC Group 1 Answer Key: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఆన్సర్ కీ విడుదల.. ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి..
APPSC Group 1 Answer Key
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు-1 ప్రిలిమినరీ రాత పరీక్ష జనవరి 8న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ ఆన్సర్‌ ‘కీ’ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్‌ కీపై జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించనున్నట్లు ఈ సందర్భంగా కమిషన్‌ పేర్కొంది. ఆన్‌లైన్‌ విధానంలోకాకుండా మరే విధంగానైనా అభ్యంతరాలను తెలయజేస్తే వాటిని పరిగణనలోకి తీసుకోబోయేదిలేదని స్పష్టం చేసింది. ఒక్కో అభ్యంతరానికి 100 రూపాయలు తప్పనిసరిగా చెల్లించాలని తెలిపింది. గడువు తేదీ తర్వాత వచ్చిన అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకునేదిలేదని వివరించింది.

కాగా మొత్తం 111 గ్రూప్‌ 1 పోస్టులకు దాదాపు 87,718 మంది పరీక్ష రాశారు. మూడు వారాల్లోనే ఫలితాలు కూడా విడుదలవనున్నాయి. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ప్రకటించిన 90 రోజుల తర్వాత మెయిన్స్‌కూడా నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు-1 ప్రిలిమినరీ రాత పరీక్ష పేపర్-1 కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు-1 ప్రిలిమినరీ రాత పరీక్షపేపర్-2 కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.