APPSC Polytechnic Lecturer Posts
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) 99 లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ టెక్ట్స్‌టైల్‌లోని సంబంధిత బ్రాంచిలో బీఈ, బీటెక్, బీఫార్మసీ, పీజీ డిగ్రీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్‌హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జులై 01, 2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.98,400 వరకు జీతంగా చెల్లిస్తారు.
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు..
- ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ పోస్టులు: 1
- ఆటో మొబైల్ ఇంజినీరింగ్ పోస్టులు: 8
- బయో-మెడికల్ ఇంజినీరింగ్ పోస్టులు: 2
- కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ పోస్టులు: 12
- సిరామిక్ టెక్నాలజీ పోస్టులు: 1
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పోస్టులు: 4
- కెమిస్ట్రీ పోస్టులు: 8
- సివిల్ ఇంజినీరింగ్ పోస్టులు: 15
- కంప్యూటర్ ఇంజినీరింగ్ పోస్టులు: 8
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పోస్టులు: 10
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పోస్టులు: 2
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ పోస్టులు: 1
- ఇంగ్లిష్ పోస్టులు: 4
- గార్మెంట్ టెక్నాలజీ పోస్టులు: 1
- జియాలజీ పోస్టులు: 1
- మ్యాథమెటిక్స్ పోస్టులు: 4
- మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టులు: 6
- మెటలర్జికల్ ఇంజినీరింగ్ పోస్టులు: 1
- మైనింగ్ ఇంజినీరింగ్ పోస్టులు: 4
- ఫార్మసీ పోస్టులు: 3
- ఫిజిక్స్ పోస్టులు: 4
- టెక్స్‌టైల్ టెక్నాలజీ పోస్టులు: 3
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జనవరి 29, 2024
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 18, 2024
- రాత పరీక్ష తేదీ: ఏప్రిల్/ మే నెలల్లో 2024.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.