Grand Summer Internship Fair 2025: విద్యార్ధులకు భలే ఛాన్స్.. గ్రాండ్ సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు వచ్చేశాయ్! దరఖాస్తు ఇలా..
దేశవ్యాప్తంగా 35 వేలకు పైగా ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఆసక్తి కలిగిన వారు వీటిల్లో పనిచేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు పంపిన వారికి ఒక విభాగంలో ఎంపిక కాకపోయినా మరోదాంట్లో ఎంపికయ్యే ఛాన్స్ ఉంటుంది..

విద్యార్ధులకు సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు అందించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయి. గ్రాండ్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఫేర్ 2025 పేరిల అంకుర సంస్థల నుంచి ప్రముఖ కంపెనీల వరకూ ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఇచ్చేందుకు వరుస కట్టాయి. ఇందులో బ్లింక్‌ఇట్, ఫోన్‌పే, కల్ట్‌ఫిట్, కార్స్24, వేక్‌ఫిట్, ఆడి, ఓయో, పైసాబజార్, రేడియో మిర్చి, బిగ్‌బాస్కెట్, హిందుస్థాన్ టైమ్స్, ఫస్ట్ క్రై, థామస్‌కుక్, అర్బన్‌కంపెనీ వంటి ఎన్నో ప్రముఖ సంస్థలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 35 వేలకు పైగా ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఆసక్తి కలిగిన వారు వీటిల్లో పనిచేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు పంపిన వారికి ఒక విభాగంలో ఎంపిక కాకపోయినా మరోదాంట్లో ఎంపికయ్యే ఛాన్స్ ఉంటుంది.
గ్రాండ్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఫేర్ 2025 రిజిస్ట్రేషన్‌కు ఇక్కడ క్లిక్ చేయండి.
వివిధ రంగాలకు చెందిన విద్యార్థులు ఎవరైనా ఈ ఇంటర్న్‌షిప్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కెటింగ్, లా, అకౌంటింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్‌మెంట్, పైతాన్ డెవలప్‌మెంట్, కంటెంట్ రైటింగ్, సేల్స్, హ్యూమన్ రిసోర్సెస్, బిజినెస్ డెవలప్‌మెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, ప్రోగ్రామింగ్, ఫైనాన్స్ విభాగాల విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇందులో వివిధ రకాల ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. అంటే నెల వ్యవధి నుంచి 6 నెలల కాలం వరకు రకరకాల ఇంటర్న్‌షిప్‌లు ఉన్నాయి. విద్యార్ధుల ఆసక్తిని బట్టి పార్ట్‌టైమ్ ఇంటర్న్‌షిప్‌లు, రెగ్యులర్ ఇంటర్న్‌షిప్‌లు ఎంచుకోవచ్చు. ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లు మార్చి నుంచి జూన్ వరకూ ఉంటాయి. విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న సమయంలో పని చేసుకోవచ్చన్నమాట. ఎంపికైన అభ్యర్థులు రూ.వెయ్యి నుంచి 60 వేల వరకూ స్టైపెండ్ అందిస్తారు. అలాగే సర్టిఫికెట్ కూడా అందజేస్తారు.
విద్యార్ధులు తమకు అనుకూలంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇన్-ఆఫీస్, వర్చువల్, పార్ట్-టైమ్, ఇంటర్నేషనల్ ఇంటర్న్‌పిప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ విధమైన సమ్మర్ ఇంటర్న్‌షిప్‌ల ద్వారా ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంచుకోవచ్చు. అనుభవం లేకపోయినా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని కంపెనీలైతే ఇంటర్న్‌షిప్ తర్వాత ఏకంగా ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఇకేం.. ఈ సమ్మర్‌ను విద్యార్ధులు ఫుల్‌గా వాడేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మార్చి 31, 2025వ తేదీతో దరఖాస్తులు ముగుస్తాయి. వెంటనే దరఖాస్తు చేసుకోండి..