APPGECET 2021: ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..
AP State Eligibility Test 2021: ఆంధ్రప్రదేశ్ పీజీ సెట్ నోటిఫికేషన్ విడులైంది. వివిధ పీజీ కోర్సులలో ప్రవేశ పరీక్షలకి ఉన్నత విద్యా మండలి పీజీ సెట్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది కడప యోగి వేమన యూనివర్సిటీ పీజీ సెట్‌ను నిర్వహణా బాధ్యతలను తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ పీజీ సెట్ నోటిఫికేషన్ విడులైంది. వివిధ పీజీ కోర్సులలో ప్రవేశ పరీక్షలకి ఉన్నత విద్యా మండలి పీజీ సెట్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది కడప యోగి వేమన యూనివర్సిటీ పీజీ సెట్‌ను నిర్వహణా బాధ్యతలను తీసుకుంది. బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో ధరఖాస్తుల స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఓసీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.850, బీసీలకి రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ.650గా ఫీజు నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ధరఖాస్తుల స్వీకరణకి సెప్టెంబర్ 30వ తేదీ తుది గడువుగా పేర్కొంది. రూ. 200 అదనపు రుసుముతో అక్టోబర్ నాలుగు వరకు గడువు ఉన్నట్లు తెలిపింది. రూ.500 అదనపు రుసుముతో అక్టోబర్ 8 వరకు తుది గడువు ఉన్నట్లు పేర్కొంది. అక్టోబర్ 22వ తేదీన పీజీ సెట్ పరీక్ష జరగనుంది.
ముఖ్య సమాచారం:
రిజిస్ట్రేషన్ ఫీజు: ఓసీ విద్యార్థులకు రూ.850, బీసీలకి రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ.650 అదనపు రుసుము: రూ. 200 అదనపు రుసుముతో అక్టోబర్ నాలుగు వరకు గడువు ఉన్నట్లు తెలిపింది. రూ.500 అదనపు రుసుముతో అక్టోబర్ 8 వరకు దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరితేదీ: సెప్టెంబర్ 30, 2021 పరీక్ష తేదీ: అక్టోబర్ 22, 2021 వెబ్‌సైట్: https://apset.net.in
ఇవి కూడా చదవండి: నెల్లూరులో దారుణం.. యువతిని వ్యభిచారం చేయాలంటూ దారుణంగా హింసించిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
Viral Video:నీటి గుంటలో ఎంచక్కా ఈత కొట్టేస్తున్న బుజ్జి కుక్క పిల్లలు.. మీ కళ్లను మీరే నమ్మలేరు..