AP SSC 2021 Results: విడుదలైన ఏపీ పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్స్‌ను ఇలా చెక్‌ చేసుకోండి..

|

Aug 06, 2021 | 5:15 PM

AP 10th Class Results 2021: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. కరోనా కారణంగా ప్రభుత్వం పదో తగరతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌లు ప్రకటించారు. ఈ ఫలితాలను కాసేపటి క్రితమే...

AP SSC 2021 Results: విడుదలైన ఏపీ పదో తరగతి ఫలితాలు.. రిజల్ట్స్‌ను ఇలా చెక్‌ చేసుకోండి..
Ap 10th Class Results
Follow us on

AP SSC 2021 Results: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. కరోనా కారణంగా ప్రభుత్వం పదో తగరతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్‌లు ప్రకటించారు. ఈ ఫలితాలను కాసేపటి క్రితమే ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పరీక్షలు రద్దైన నేపథ్యంలో పరీక్షా ఫలితాలను నిర్ణయించడానికి ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించారు. ఇంటర్నల్‌గా 50 మార్కుల చొప్పున నిర్వహించిన 3 ఫార్మేటివ్ అసెస్‌మెంట్ల ఆధారంగా ఈ గ్రేడ్లు ప్రకటించారు. ఈ ఏడాది పదో తరగతి కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,38,000 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో ఓపెన్‌ స్కూల్‌ అభ్యర్థులను సైతం ప్రభుత్వం పాస్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా దరఖాస్తు చేసుకున్న వారందరినీ పరీక్షలతో సంబంధం లేకుండా ఉత్తీర్ణులుగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

ఫలితాలను ఇలా చెక్‌ చేసుకోండి..

* అభ్యర్థులు ముందుగా bie.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* తర్వాత ఏపీ ఎస్‌ఎస్‌సీ రిజల్ట్స్‌ 2021 లింక్‌ను ఓపెన్‌ చేయాలి.
* తర్వాత లాగిన్‌ పేజీలోకి వెళ్లాలి.
* అనంతరం మీ ఎన్‌రోల్‌ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీని ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
* చివరిగా మీ ఫలితాల పేజీని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రింట్‌ తీసుకోవాలి.
* ఇక విద్యార్థులు తమ మార్కుల మెమోను bse.ap.gov.inలోకి వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: EV Expo2021: ప్రారంభమైన ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎక్స్‌పో..మనదేశ ఉత్పత్తులే ఎక్కువ! 

RS Praveen Kumar: RS ప్రవీణ్‌కుమార్‌ పొలిటికల్ ఎంట్రీ.. నల్గొండ వేదికగా ఆ పార్టీలోకి..

AP Crime News: తప్పు.. తప్పు.. రూటు మార్చిన పూజారి.. భక్తులకు అడ్డంగా దొరికిపోయాడు