AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP 10th Supply Results 2026: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఎంత మంది పాస్‌ అయ్యారంటే?

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ జూన్‌ 19న విడుదల చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా లేదా వాట్సాప్‌ సేవ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. పాసైన విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలియజేశారు.

AP 10th Supply Results 2026: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఎంత మంది పాస్‌ అయ్యారంటే?
AP SSC Supplementary results
Srilakshmi C
|

Updated on: Jun 19, 2026 | 11:36 AM

Share

అమరావతి, జూన్‌ 19: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదయ్యాయి. ఈ రోజు (జూన్‌ 19న) ఉదయం 10 గంటలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన మిత్ర వాట్సప్‌ నంబర్‌ 9552300009కు Hi అని మెసేజ్‌ పంపించి రిజల్ట్స్‌ తెలుసుకోవచ్చు. ఈ మేరకు పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఫలితాల పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా మే 25 నుంచి జూన్‌ 4వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మూల్యాంకన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేశారు. అధికారులు ఫలితాలను విడుదలకు సిద్ధం చేశారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 94,990 మంది విద్యార్థులు హాజరుకాగా.. 78,261 మంది ఉత్తీర్ణత సాధించారు. పాసైన విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు.

కాగా ఇప్పటికే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా వచ్చేశాయి. దీంతో రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలు ఊపందుకోనున్నాయి.

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us