AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్ధులకు దసరా సెలవులు 2026 వచ్చేశాయ్‌.. రేపట్నుంచే అన్ని స్కూళ్లకు హాలిడేస్‌..!

పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులు కాస్త ముందుగానే వచ్చాయి. 2026–27 విద్యా క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 10 రెండో శనివారం, 11 ఆదివారం కావడంతో విద్యార్థులకు వరుసగా 12 రోజుల సెలవులు లభించనున్నాయి. అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఇవాళ్టితో పరీక్షలు ముగియనుండటంతో రేపు మధ్యాహ్నం నుంచే..

విద్యార్ధులకు దసరా సెలవులు 2026 వచ్చేశాయ్‌.. రేపట్నుంచే అన్ని స్కూళ్లకు హాలిడేస్‌..!
Schools Dussehra Holidays
Srilakshmi C
|

Updated on: Oct 08, 2026 | 12:19 PM

Share

అమరావతి, అక్టోబర్‌ 8: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు దసరా పండుగ సందర్భంగా వరుస సెలవులు రానున్నాయి. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అయితే ఈ సెలవులకు ముందు అక్టోబర్ 10 రెండో శనివారం, అక్టోబర్ 11 ఆదివారం కావడంతో విద్యార్థులకు వరుసగా సెలవులు లభించనున్నాయి. దీంతో అక్టోబర్ 10 నుంచే పాఠశాలలకు సెలవులు ప్రారంభమై, అక్టోబర్ 21 వరకు కొనసాగనున్నాయి. దసరా సెలవులు ముగిసిన అనంతరం అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో రేపు శుక్రవారం (అక్టోబర్ 9) మధ్యాహ్నం నుంచే హాస్టళ్లు, కాలేజీలు, స్కూళ్లకు సెలవులు రానున్నాయి. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఈ సెలవుల కోసం ముందుగానే ట్రిప్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు.

మొత్తం ఎన్ని రోజులు సెలవులంటే..?

  • అక్టోబర్ 10: రెండో శనివారం
  • అక్టోబర్ 11: ఆదివారం
  • అక్టోబర్ 12–21: దసరా సెలవులు
  • అక్టోబర్ 22: పాఠశాలలు పునఃప్రారంభం

అంటే వారాంతపు సెలవులతో కలిపి విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచి 21 వరకు వరుసగా 12 రోజులు స్కూల్ సెలవులు లభించనున్నాయి. మరోవైపు ఏపీ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన 2026–27 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం విద్యార్థులకు మొత్తం 87 సెలవులు, పాఠశాలలకు 229 పనిదినాలు ఉండనున్నాయి. దసరాతో పాటు క్రిస్మస్, సంక్రాంతి తదితర పండుగలకు కూడా సెలవులు ప్రకటించారు. దసరా సెలవులు కేవలం విశ్రాంతికే కాకుండా చదువుకు కూడా ఉపయోగించుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పటికే స్కూళ్లలో ఫార్మెటివ్ 2 పరీక్షలు మొదలయ్యాయి. అక్టోబర్ 5 నుంచి 8 మధ్య ఈ పరీక్షలు జరుగుతున్నాయి. అంటే ఈ రోజుతో ఈ పరీక్షలు ముగియనున్నాయి. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే విద్యార్ధులు ఇంటి బాట పట్టనున్నారు. ఇక అధికారులు దసరా సెలవుల కోసం ప్రత్యేకంగా బస్సులు, రైళ్లు నడుపుతున్నారు. పరీక్షల అనంతరం విద్యార్థులు సెలవులను సద్వినియోగం చేసుకుని పెండింగ్‌లో ఉన్న పాఠాలను పూర్తి చేసుకోవచ్చు. పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అధికారిక దసరా సెలవులు అక్టోబర్ 12 నుంచి 21 వరకు అయితే అక్టోబర్ 10, 11 వారాంతపు సెలవులు కలవడంతో విద్యార్థులకు 12 రోజుల వరుస సెలవులు వస్తున్నాయి. అన్ని పాఠశాలలు అక్టోబర్ 22న తిరిగి ప్రారంభం కానున్నాయి.

Follow Us