AP RGUKT 2024 Counselling Result: ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు జనరల్‌ కౌన్సెలింగ్‌ ఫలితాలు విడుదల.. జులై 22- 27 తేదీల్లో కౌన్సెలింగ్

|

Jul 12, 2024 | 7:25 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి ఫేజ్-1 ప్రవేశాలకు జనరల్‌ కౌన్సెలింగ్‌ ముగిసింది. ఇందులో అర్హులైన అభ్యర్థుల జాబితాను గురువారం (జులై 11న) విడుదల చేసింది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి..

AP RGUKT 2024 Counselling Result: ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు జనరల్‌ కౌన్సెలింగ్‌ ఫలితాలు విడుదల.. జులై 22- 27 తేదీల్లో కౌన్సెలింగ్
AP RGUKT 2024 Counselling Results
Follow us on

అమరావతి, జులై 12: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి ఫేజ్-1 ప్రవేశాలకు జనరల్‌ కౌన్సెలింగ్‌ ముగిసింది. ఇందులో అర్హులైన అభ్యర్థుల జాబితాను గురువారం (జులై 11న) విడుదల చేసింది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల కోసం 53,863 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికైన విద్యార్థులకు నూజివీడు క్యాంపస్‌లో జులై 22, 23 తేదీల్లో, ఇడుపులపాయలో జులై 22, 23 తేదీల్లో, ఒంగోలులో జులై 24, 25 తేదీల్లో, శ్రీకాకుళంలో జులై 26, 27 తేదీల్లో ధృవపత్రాల పరిశీలన ఉంటుంది.

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ట్రిపుల్ఐటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారనే విషయం తెలిసిందే. అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల పూర్తి లిస్ట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

సీఏ ఫైనల్, ఇంటర్‌ 2024 పరీక్షల ఫలితాలు.. రిజల్ట్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

ఐసీఏఐ సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్ 2024 పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు ఐసీఏఐ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ రోల్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ వివరాలు నమోదు చేసి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. సీఏ ఇంటర్మీడియట్‌, సీఏ ఫైనల్ పరీక్షలు ఈ ఏడాది మే నెలలో నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

సీఏ ఫైనల్, ఇంటర్‌ 2024 పరీక్షల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.