AP SI Mains 2023 Hall Tickets: ఏపీ ఎస్సై తుది రాత పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి..
ఆంధ్రప్రదేశ్ ఎస్సై ఉద్యోగ నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్షల హాల్‌టికెట్లను ఏపీ పోలీసు నియామక మండలి విడుదల చేసింది. అభ్యర్థులు సంబంధిత వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 12వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నియామక బోర్డు తెల్పింది. కాగా మొత్తం 411 ఎస్సై ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..
![AP SI Mains 2023 Hall Tickets: ఏపీ ఎస్సై తుది రాత పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/10/ap-si-mains-2023-hall-ticke.jpg?w=1280)
అమరావతి, అక్టోబర్ 6: ఆంధ్రప్రదేశ్ ఎస్సై ఉద్యోగ నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్షల హాల్‌టికెట్లను ఏపీ పోలీసు నియామక మండలి విడుదల చేసింది. అభ్యర్థులు సంబంధిత వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 12వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నియామక బోర్డు తెల్పింది. కాగా మొత్తం 411 ఎస్సై ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రిలిమినరీ పరీక్షల్లో దాదాపు 31,193 మంది అభ్యర్ధులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరిలో 27,590 మంది పురుషులు, 3,603 మంది మహిళలు ఉన్నారు. పీఎంటీ/పీఈటీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్ 14, 15 తేదీల్లో తుది రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు APSLPRB ఇప్పటికే ప్రకటించింది.
ఎస్సై మెయిన్స్ పరీక్ష మొత్తం నాలుగు పేపర్లకు ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. మిగతా రెండు పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. అక్టోబర్ 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ 1 పరీక్ష ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. ఈ రెండు పరీక్షలు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. ఇక అక్టోబర్ 15న జరిగే పరీక్ష కూడా రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ 3 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 4 పరీక్ష ఉంటుంది. ఈ రెండు పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఎస్సై మెయిన్స్ పరీక్షలకు విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎస్సై అభ్యర్ధులకు సెప్టెంబర్‌లో ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ)లను పోలీసు నియామక మండలి నిర్వహించింది. సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) పోస్టులను పురుషులు, మహిళలను ఎంపిక చేస్తారు. రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్టులకు కేవలం పురుషులను మాత్రమే ఎంపిక చేయనున్న విషయం తెలిసిందే.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.