అమరావతి, జులై 30: రాష్ట్రంలోని యూనివర్శిటీలు, ప్రయివేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ల కొరకు కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేసింది ప్రభుత్వం. ఎంటెక్, ఎం ఫార్మాసి, ఫార్మాడి (పీజీ) కోర్సుల్లో ప్రవేశాల కొరకు పీజీఈసెట్ లో అర్హత సాధించిన విద్యార్ధులకు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. రెండేళ్ల ఎంటెక్, రెండేళ్ల ఎం ఫార్మసీ కోర్సులతో పాటు బీ ఫార్మసీ చదివిన విద్యార్ధులు నాలుగో ఏడాది ఫార్మా డీ కోర్సులో నేరుగా చేరేందుకు అడ్మిషన్లు జరగనున్నాయి.
కాగా ఈ ఏడాది మే 28 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆన్ లైన్ లో పీజీఈసెట్ కొరకు పరీక్షలను ఉన్నతవిద్యామండలి, వెంకటేశ్వర యూనివర్శిటీ కలిపి నిర్వహించాయి. ఎంట్రన్స్ పరీక్షల ఫలితాలను జూన్ లోనే విడుదల చేసారు అధికారులు. అయితే కళశాలల్లో ప్రవేశాల కొరకు నిర్వహించే వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసారు. గేట్, జీపాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన ర్యాంకర్లకు కూడా ఈ కౌన్సెలింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ముందుగా గేట్, జీపాట్ ఎంట్రన్స్ రాసిన వారికి కౌన్సెలింగ్ లో ప్రాధాన్యత ఇస్తారు.
ఇతర వివరాలకు వెబ్ సైట్ లో వివరాలు పొందుపరిచినట్లు ఉన్నతవిద్యామండలి అధికారులు తెలిపారు.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.