AP Lawcet 2024: ఏపీ లాసెట్ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే!

|

Apr 28, 2024 | 7:01 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వివిధ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీ లా సెట్‌ దరఖాస్తు గడువు పెంపొందించారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 4 వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని..

AP Lawcet 2024: ఏపీ లాసెట్ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే!
AP Lawcet 2024
Follow us on

అమరావతి, ఏప్రిల్ 28 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వివిధ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, పీజీ లా సెట్‌ దరఖాస్తు గడువు పెంపొందించారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 4 వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆలస్య రుసుంతో మే 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రూ.500 ఆలస్య రుసుంతో మే 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.1000 ఆలస్య రుసుంతో మే 18 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుంతో మే 25 వరకు, రూ.3 వేల ఆలస్య రుసుంతో మే 29 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. దరఖాస్తుల సవరణకు మే 30 నుంచి జూన్‌ 1 వరకు అవకాశం ఇస్తారు. కాగా ఈ ఏడాది లా సెట్‌ పరీక్షను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. లాసెట్‌ అడ్మిట్‌ కార్డులు జూన్‌ 3వ తేదీ నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు. లా సెట్, పీజీ లా సెట్‌ పరీక్షలు జూన్‌ 9వ తేదీన మధ్యాహ్నం 2:30 నుండి 4:00 గంటల వరకు నిర్వహించనున్నారు.

ఏపీ లా సెట్‌ 2024 పరీక్షా విధానం

ఏపీ లా సెట్‌ 2024 పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత మోడ్‌లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రం తెలుగు/ ఆంగ్లం మాత్రమే ఉంటుంది. మొత్తం మూడు విభాగాల్లో పరీక్ష జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్‌, ఆప్టిట్యూడ్‌.. ఈ మూడు విభాగాలలో ఆప్టిట్యూడ్ విభాగానికి అత్యధిక వెయిటేజీ ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. మొత్తం 120 మల్టిపుల్‌ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉండదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.