ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవరం ఇంటర్ ఫస్ట్ ఇయర్‌తో పాటు సెకండ్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ పరీక్షల్లో 4 లక్షల 84వేల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, 5లక్షల 19వేల మంది విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2,66,322 మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ విషయానికొస్తే మొత్తం 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 65 శాతం, 58 బాలురు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్‌లో బాలికలు 75 శాతం మంది బాలికలు, 68 శాతం మంది బాలురు పాస్ అయ్యారు. మొత్తం మీద ఇంటర్ రిజల్ట్స్‌లో బాలికలదే పైచేయి.
ఫలితాలపై విద్యార్థులకు ఎవరికైనా సందేహాలు ఉంటే రీకౌంటింగ్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు రీకౌంటింగ్, రీ విరిఫికేషన్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఇక ఫెయిల్ అయిన విద్యార్థులు మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు రెండు సెషన్స్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకుగాను గురువారం నుంచి మే నెల 3వ తేదీ వరకు ఫీజు చెల్లించుకునే వెసులుబాటును కల్పించారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..