AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CETs 2025 Schedule Released: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈఏపీసెట్‌, ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌ సెట్‌ వంటి పలుఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడూల్‌ను ఉన్నత విద్యా మండలి గురువారం రాత్రి విడుదల చేసింది. దీంతో ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న విద్యార్ధుల నిరీక్షణకు తెరపడినట్లైంది. ఆయా ప్రవేశ పరీక్షలు మే 2 నుంచి జూన్‌ 25 వరకు వరుసగా జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్‌ ఈ కింద చెక్‌ చేసుకోవచ్చు..

AP CETs 2025 Schedule Released: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
AP CETs 2025 Schedule
Srilakshmi C
|

Updated on: Feb 14, 2025 | 2:55 PM

Share

అమరావతి, ఫిబ్రవరి 14: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం రాత్రి (ఫిబ్రవరి 13) విడుదల చేశారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్‌ 2025 పరీక్ష మే 19 నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. అన్ని ప్రవేశ పరీక్షలు మే 2 నుంచి ప్రారంభమై.. జూన్‌ 25 వరకు జరగుతాయి. పరీక్షలు సమీపిస్తున్న క్రమంలో రాష్ట్ర విద్యార్థులంతా బాగా చదివి పరీక్షల్లో విజయం సాధించాలని మంత్రి లోకేశ్‌ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల 2025 షెడ్యూల్‌ పూర్తి వివరాలు ఇవే..

  • ఏపీఆర్‌ సెట్‌ (పీహెచ్‌డీ) 2025 పరీక్ష తేదీ: మే 2 నుంచి 5 వరకు
  • ఏపీ ఈ సెట్‌ (ఇంజినీరింగ్‌ డిప్లొమా లేటరల్ ఎంట్రీ) 2025 పరీక్ష తేదీ: మే 6
  • ఏపీ ఐ సెట్‌ 2025 (ఎంబీఏ, ఎంసీఏ) పరీక్ష తేదీ: మే 7
  • ఏపీ ఈఏపీ సెట్‌ 2025 (అగ్రికల్చర్‌, ఫార్మా) పరీక్ష తేదీ: మే 19, 20
  • ఏపీ ఈఏపీ సెట్‌ 2025 (ఇంజినీరింగ్‌) పరీక్ష తేదీ: మే 21 నుంచి 27 వరకు
  • ఏపీ లా సెట్‌ (ఎలఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం) 2025 పరీక్ష తేదీ: మే 25
  • ఏపీ పీజీఈ సెట్‌(ఎంటెక్‌, ఎంఫాం) 2025 పరీక్ష తేదీ: జూన్‌ 5, 6, 7
  • ఏపీ ఎడ్‌ సెట్‌ (బీఈడీ) 2025 పరీక్ష తేదీ: జూన్‌ 8
  • ఏపీ పీజీ సెట్‌ (ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం) 2025 పరీక్ష తేదీ: జూన్‌ 9 నుంచి 13 వరకు
  • ఏపీ పీజీ సెట్‌ (బీపీఈడీ, యూజీ డీపీఈడీ, ఎంపీఈడీ) 2025 పరీక్ష తేదీ: జూన్‌ 25

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.