AP Animal Husbandry Results 2024: రేపు విడుదలకానున్న పశు సంవర్ధక సహాయకుల పోస్టుల రాత పరీక్ష ఫలితాలు.. పూర్తి వివరాలు ఇవే
పశు సంవర్ధక సహాయకుల పోస్టుల (ఏహెచ్‌ఏ) రాత పరీక్ష ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈ ఫలితాలు గురువారం (జనవరి 178) విడుదలకానున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఏహెచ్‌ఏ పోస్టుల నియామక పరీక్షకు సంబంధించిన ఫలితాలను విడుదల చేస్తారని తొలుత ప్రకటించినా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఫలితాలను రేపు వెల్లడిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పశు సంవర్ధక సహాయకుల పోస్టుల నియామకాలకు రాత పరీక్ష రాసిన..
అమరావతి, జనవరి 17: పశు సంవర్ధక సహాయకుల పోస్టుల (ఏహెచ్‌ఏ) రాత పరీక్ష ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈ ఫలితాలు గురువారం (జనవరి 178) విడుదలకానున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఏహెచ్‌ఏ పోస్టుల నియామక పరీక్షకు సంబంధించిన ఫలితాలను విడుదల చేస్తారని తొలుత ప్రకటించినా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఫలితాలను రేపు వెల్లడిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పశు సంవర్ధక సహాయకుల పోస్టుల నియామకాలకు రాత పరీక్ష రాసిన అభ్యర్థులు రేపు ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. కాగా గత ఏడాది డిసెంబర్ 31న యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ (ఏహెచ్‌ఏ) నియామక పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరిగిన విషయం తెలిసిందే.
పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసులో రెగ్యులర్ ప్రాతిపదికన మొత్తం 1,896 ఖాళీలను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. నియామక ప్రక్రియలో గోపాలమిత్ర / గోపాలమిత్ర సూపర్‌వైజర్‌గా పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజీ మార్కులు కలుపుతారు. ఎంపికైన వారికి రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్ పే చెల్లిస్తారు. అనంతరం నెలకు రూ.22,460 నుంచి రూ.72,810 వరకు జీతంగా చెల్లిస్తారు
జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు..
- అనంతపురంలో పోస్టుల సంఖ్య: 473
- చిత్తూరులో పోస్టుల సంఖ్య: 100
- కర్నూలులో పోస్టుల సంఖ్య: 252
- వైఎస్సార్‌లో పోస్టుల సంఖ్య: 210
- నెల్లూరులో పోస్టుల సంఖ్య: 143
- ప్రకాశంలో పోస్టుల సంఖ్య: 177
- గుంటూరులో పోస్టుల సంఖ్య: 229
- కృష్ణాలో పోస్టుల సంఖ్య: 120
- పశ్చిమ గోదావరిలో పోస్టుల సంఖ్య: 102
- తూర్పు గోదావరిలో పోస్టుల సంఖ్య: 15
- విశాఖపట్నంలో పోస్టుల సంఖ్య: 28
- విజయనగరంలో పోస్టుల సంఖ్య: 13
- శ్రీకాకుళంలో పోస్టుల సంఖ్య: 34
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.