SSC Pre-Final Exam Time Table 2025: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. ప్రీ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు ప్రీ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ప్రీ ఫైనల్‌ పరీక్షలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు ఈ జరగనున్నాయి. పబ్లిక్‌ పరీక్షలు కూడా ఇదే తరహాలో ఉంటాయి కాబట్టి విద్యార్ధులు తప్పనిసరిగా ఈ పరీక్షలకు హాజరుకావల్సి ఉంటుంది..

SSC Pre-Final Exam Time Table 2025: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. ప్రీ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
SSC Pre-Final Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 04, 2025 | 10:03 AM

అమరావతి, ఫిబ్రవరి 4: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రీ ఫైనల్‌ పరీక్షల టైం టేబుల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు సోమవారం షెడ్యూల్‌ ప్రకటించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి.

టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షల పూర్తి టైం టేబుల్‌ ఇదే..

  • ఫిబ్రవరి 10వ తేదీ ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (గ్రూప్‌ ఏ), ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1(కాంపోజిట్‌ కోర్సు) పరీక్షలు
  • ఫిబ్రవరి 11వ తేదీ సెకండ్‌ లాంగ్వేజ్ పరీక్ష
  • ఫిబ్రవరి 12న ఇంగ్లిషు పరీక్ష
  • ఫిబ్రవరి 13న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 (కాంపోజిట్‌ కోర్సు), ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్‌) పరీక్ష
  • ఫిబ్రవరి 15న గణితం పరీక్ష
  • ఫిబ్రవరి 17న భౌతిక శాస్త్రం పరీక్ష
  • ఫిబ్రవరి 18న జీవ శాస్త్రం పరీక్ష
  • ఫిబ్రవరి 19న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్‌), ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు (థియరీ) పరీక్ష
  • ఫిబ్రవరి 20న సోషల్‌ స్టడీస్‌ పరీక్ష

ఇక టెన్త్‌ విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్ కూడా ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి నెలలో పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిజికల్‌ సైన్స్, బయలాజీకల్‌ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.