AP SSC and Inter Supply Exams 2024: ఏపీలో ఒకేసారి టెన్త్, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు.. మే 24 నుంచి ప్రారంభం

|

May 22, 2024 | 11:56 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌ టికెట్లను కూడా ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే తమ కాలేజీల్లో ప్రిన్సిపల్స్‌ వద్ద నుంచి కూడా హాల్‌ టికెట్లను తీసుకోవచ్చు. ఈ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు..

AP SSC and Inter Supply Exams 2024: ఏపీలో ఒకేసారి టెన్త్, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు.. మే 24 నుంచి ప్రారంభం
AP SSC and Inter Supply Exams
Follow us on

అమరావతి, మే 22: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌ టికెట్లను కూడా ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు నేరుగా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే తమ కాలేజీల్లో ప్రిన్సిపల్స్‌ వద్ద నుంచి కూడా హాల్‌ టికెట్లను తీసుకోవచ్చు. ఈ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరుగుతాయి.

ఆయా తేదీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 861 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్‌లో 3,46,393 మంది విద్యార్ధులు, సెకండ్‌ ఇయర్‌లో 1,21,545 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు.

24 నుంచి ఏపీ ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు

మరో వైపు మే 24 నుంచి జూన్‌ 3 వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు కూడా జరగనున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1,61,877 మంది హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలు ఉంటాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులను ఉదయం 8.45 నుంచే అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమతోపాటు హాల్‌టికెట్లను తీసుకురావాలని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.