AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP ICET 2025 Revised Schedule: ఏపీ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ మారిందోచ్‌.. కొత్త తేదీలు ఇవే

ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జులై 13న నుంచి వెబ్‌ ఐచ్ఛికాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. అది జులై 16 నుంచి ప్రారంభమైంది. దీంతో మిగతా తేదీల్లోనూ మార్పు చేస్తూ ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది..

AP ICET 2025 Revised Schedule: ఏపీ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ మారిందోచ్‌.. కొత్త తేదీలు ఇవే
AP ICET Revised Schedule
Srilakshmi C
|

Updated on: Jul 17, 2025 | 6:44 AM

Share

అమరావతి, జులై 17: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జులై 13న నుంచి వెబ్‌ ఐచ్ఛికాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. అది జులై 16 నుంచి ప్రారంభమైంది. దీంతో మిగతా తేదీల్లోనూ మార్పు చేస్తూ ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ పోర్టల్‌ను యాక్సెస్ చేయడానికి, అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ అవ్వాలి. సవరించిన షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్ ఎంట్రీకి జూలై 21 వరకు అవకాశం ఉంటుంది. కట్-ఆఫ్‌లను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు గరిష్టంగా ఐదు ప్రాధాన్యాలను ఇవ్వవచ్చు.

ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలకు అనుమతుల జారీలో జాప్యం కారణంగా ఐసెట్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు కలిపి 340 వరకు ఉన్నాయి. వీటిలో సీట్లకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ జీవోలు జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో జాప్యం కారణంగా వెబ్‌ ఐచ్ఛికాలు వాయిదా పడ్డాయి. అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 19 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లను సవరించడానికి జూలై 22న అవకాశం ఇస్తారు. తొలి దశ సీట్ల కేటాయింపు జూలై 25న ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్ధులు జూలై 26 నుంచి 28 మధ్య వారికి కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కొత్త విద్యా సంవత్సరం తరగతులు జూలై 28 నుంచి ప్రారంభమవుతాయి.

తెలంగాణ బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత ఫౌండేషన్‌ కోర్సు

తెలంగాణ బీసీ స్టడీసర్కిళ్ల పరిధిలో గ్రూప్‌ 1, 2, 3, 4, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్‌ రిక్రూట్‌మెంట్‌ల కోసం ఉచిత ఫౌండేషన్‌ కోర్సు అందించనున్నట్లు స్టడీసర్కిల్‌ డైరెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అర్హులు జులై 16 నుంచి ఆగస్టు 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,000 చొప్పున 5 నెలలపాటు స్టైపెండ్‌తోపాటు ఉచిత స్టడీ మెటీరియల్‌ కూడా ఇస్తామని తెలిపారు. ఇతర వివరాలకు 040-24071178 ఫోన్‌ నంబరును సంప్రదించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
అద్భుతమైన హెల్త్ ఫీచర్లతో బోట్‌ నుంచి స్మార్ట్‌ వేరబుల్‌
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
తెలుగులో బ్యాన్ చేశారు.. కట్ చేస్తే.. బిగ్ బాస్‏లోకి ఎంట్రీ..
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
డీమార్ట్ ఊహించని నిర్ణయం.. వాటి దెబ్బకు 7 నగరాల్లో షట్టర్ క్లోజ్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
'కన్నీళ్లతో మా బాధను ముడిపెట్టొద్దు'.. జానకి మనవరాలు ఎమోషనల్
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం