AP Schools Upgrade: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! పాఠశాలల అప్‌గ్రేడ్‌కు ఉత్తర్వులు జారీ.. 1752 స్కూల్‌ అసిస్టెంట్లు

|

Jul 08, 2022 | 7:48 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేస్తూ ప్రభుత్వం గురువారం (జులై 7) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలలను ప్రత్యేకంగా బాలికలకు కేటాయిస్తున్నట్లు ఆదేశాల్లో..

AP Schools Upgrade: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! పాఠశాలల అప్‌గ్రేడ్‌కు ఉత్తర్వులు జారీ.. 1752 స్కూల్‌ అసిస్టెంట్లు
Andhra Pradesh
Follow us on

AP Schools rationalisation: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేస్తూ ప్రభుత్వం గురువారం (జులై 7) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాఠశాలలను ప్రత్యేకంగా బాలికలకు కేటాయిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. అప్ గ్రేడ్ అయిన ఈ హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ వంటి వాటిల్లో స్థానికంగా డిమాండ్ ఉన్న ఏవైనా రెండు కోర్సులను మాత్రమే అందించనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. పీజీటీ సమాన స్థాయి అధ్యాపకులనే ఈ పాఠశాలల్లో బోధనకు తీసుకోనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా 1752 స్కూల్‌ అసిస్టెంట్లను 292 జూనియర్‌ కళాశాలల్లో పనిచేసేందుకు నియమిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ పాఠశాలలో ప్రస్తుతం అమలవుతున్న నాడు నేడు పనులను దృష్టిలో పెట్టుకొని అదనపు తరగతి గదులను మంజూరు చేయమబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు.

పాఠశాలల్లో గతానికి ఇప్పటికీ స్పష్టమైన మార్పు కనిపించాలని ,ఈ పనులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఎటువంటి సమస్యలు ఎదురైనా, వాటిని వెంటనే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటనలో అన్నారు. ఇక ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించి.. జోఓ 117లో ఎమ్మెల్సీ, వివిధ సంఘాల ప్రతినిధులు కొన్ని సంవరణలు సూచించారని వాటిని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాలల ఆధారంగా టీచర్ల బదిలీలు ఉండవని, పంచాయతీల ఆధారంగానే బదిలీలు చేపడుతామని, ప్రస్తుతానికి ఎంఈఓలకు బదిలీలు ఉండబోవని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.