AP AAE and TA Recruitment 2023: ఏపీ దేవదాయ శాఖలో 70 ఇంజనీరింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..

|

Dec 26, 2023 | 1:24 PM

ఆంధప్రదేశ్‌ దేవదాయ శాఖలో 70 ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 35 ఏఈఈ (సివిల్‌), 5 ఏఈఈ (ఎలక్ట్రికల్‌), మరో 30 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌) పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీకి దేవదాయ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిసెంబర్‌ 30వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.‘ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజి ఆఫ్‌ ఇండియా’ ఈ పోస్టుల నియామక ప్రక్రియను చేబడుతోంది. ఏఈఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు..

AP AAE and TA Recruitment 2023: ఏపీ దేవదాయ శాఖలో 70 ఇంజనీరింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..
AP Endowments Department
Follow us on

ఆంధప్రదేశ్‌ దేవదాయ శాఖలో 70 ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 35 ఏఈఈ (సివిల్‌), 5 ఏఈఈ (ఎలక్ట్రికల్‌), మరో 30 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌) పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీకి దేవదాయ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిసెంబర్‌ 30వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.‘ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజి ఆఫ్‌ ఇండియా’ ఈ పోస్టుల నియామక ప్రక్రియను చేబడుతోంది. ఏఈఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత కేటగిరిలో బీఈ, బీటెక్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్‌ అసిస్టెంట్ల పోస్టులకు ఇంజనీరింగ్‌ డిప్లొమా పాసైన వారు మాత్రమే అర్హులు. రాత పరీక్ష, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగిరి రిజర్వేషన్‌ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. రాత పరీక్ష మొత్తం వంద మార్కులకు ఉంటుంది. 80 మార్కులకు సంబంధిత ఇంజనీరింగ్‌ అంశాలపైన ప్రశ్నలు అడుగుతారు. పది మార్కులకు ఇంగ్లిష్‌ ప్రావీణ్యం గురించి, మిగిలిన పది మార్కులకు జనరల్‌ నాలెడ్జితో కూడిన మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ప్రశ్నలు ఉంటాయని దేవదాయ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

దేవదాయ శాఖ పరిధిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు పురాతన ఆలయాల పునర్నిర్మాణం పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌) పథకం ద్వారా రూ. 450 కోట్లకు పైగా పనులకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అందులో రూ. 250 కోట్లకు పైగా పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అలాగే విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, కాణిపాకం తదితర ఆలయాల్లో దాదాపు రూ. 350 కోట్ల విలువైన అభివృద్ధి పనులు సాగుతున్నాయి. మరోపక్క టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా దేవదాయ శాఖ ఆధ్వర్యంలోనే రాష్ట్రమంతటా రూ. 300 కోట్ల ఖర్చుతో 3 వేల ఆలయాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

మరో రూ. 50 కోట్ల టీటీడీ ఆర్థిక సహాయంతో రాష్ట్రమంతటా 120కి పైగా కొత్త ఆలయాల నిర్మాణం సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ప్రస్తుతం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పనులు వేగంగా పూర్తి చేసేందుకు కొత్తగా ఇంజనీరింగ్‌ సిబ్బందిని నియమిస్తున్నామని, నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ‘ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా’కు బాధ్యతలు అప్పగించినట్లు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.