Akashavani Recruitment 2023: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆకాశవాణిలో 18 పార్ట్‌టైమ్‌ కరస్పాండెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

ఆకాశవాణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద తెలంగాణ రాష్ట్రంలో 18 జిల్లాల్లో పార్ట్‌టైమ్‌ కరస్పాండెంట్ల (PTC) నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు..

Akashavani Recruitment 2023: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. ఆకాశవాణిలో 18 పార్ట్‌టైమ్‌ కరస్పాండెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌
All India Radio Akashvani

Updated on: Jul 28, 2023 | 2:03 PM

హైదరాబాద్‌, జులై 28: ఆకాశవాణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద తెలంగాణ రాష్ట్రంలో 18 జిల్లాల్లో పార్ట్‌టైమ్‌ కరస్పాండెంట్ల (PTC) నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆకాశవాణి హైదరాబాద్‌ ప్రాంతీయ వార్తా విభాగం ఉపసంచాలకులు మహేశ్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

తెలంగాణలో ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, ములుగు, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, హైదరాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల్, నిర్మల్‌, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌/హనుమకొండ, యాదాద్రి, కామారెడ్డి జిల్లాల్లో ఈ పోస్టులను నియమించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలు, ఎంపిక విధానం వంటి ఇతర పూర్తి వివరాలు అకాశవాణి అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.