AISSEE 2024: సైనిక్‌ స్కూళ్లలో 6వ, 9వ తరగతిలో 2024-25 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఎంట్రన్స్‌ టెస్ట్ తేదీ ఇదే

|

Nov 10, 2023 | 4:07 PM

త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల విద్య నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్రప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో నడిచే సైనిక స్కూళ్లల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ దరఖాస్తులు కోరుతోంది. ఆరో తరగతి, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలను ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024) ద్వారా కల్పించడానికి అర్హులైన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న..

AISSEE 2024: సైనిక్‌ స్కూళ్లలో 6వ, 9వ తరగతిలో 2024-25 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఎంట్రన్స్‌ టెస్ట్ తేదీ ఇదే
Aissee 2024 Notification
Follow us on

త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల విద్య నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్రప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో నడిచే సైనిక స్కూళ్లల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ దరఖాస్తులు కోరుతోంది. ఆరో తరగతి, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలను ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024) ద్వారా కల్పించడానికి అర్హులైన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 33 సైనిక స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ స్కూళ్లతోపాటు కేంద్ర రక్షణ శాఖ కొత్తగా ఆమోదం తెలిపిన 19 కొత్త సైనిక పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచే ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుంది.

ఆరో తరగతికి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు మార్చి 31, 2024వ తేదీ నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. బాలికలకు ప్రవేశాలు ఇరువురికీ ప్రవేశాలు కల్పిస్తారు. సీట్ల లభ్యత సంఖ్య, వయోపరిమితి ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. ఇక తొమ్మిదో తరగతిలో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధుల వయస్సు 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండాలి. ఎనిమిదో తరగతి పాసై ఉండాలి. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్‌ 16వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. సైనిక స్కూళ్లన్నింటిలో సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు. అంతేకాకుండా ఇవన్నీ ఇంగ్లిష్‌ మీడియం రెసిడెన్షియల్‌ పాఠశాలలు కావడం మరో విశేషం. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ నేవీ అకాడమీ, ఇతర శిక్షణా అకాడమీలకు ఇక్కడ క్యాడెట్లను సిద్ధం చేస్తుంటారు.

సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024) ప్రవేశ పరీక్ష జనవరి 21వ తేదీ (ఆదివారం) నిర్వహిస్తారు. పెన్ను, పేపర్‌ (OMR షీట్‌) విధానంలోనే పరీక్ష ఉంటుంది. అన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు సమాధానం ఇవ్వవల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా 186 ప్రధాన పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

దరఖాస్తు రుసుం ఎలా ఉంటుందంటే..

జనరల్‌, రక్షణ రంగంలో పనిచేస్తున్నవారి పిల్లలు, ఓబీసీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ పిల్లలు రిజిస్ట్రేషన్‌ ఫీజు కిందరూ.650, ఎస్సీ/ఎస్టీలకు రూ.500ల చొప్పున చెల్లించాలి. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.